19

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- మోదీ 3.0 కేంద్ర కేబినెట్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి ఛాన్స్ దక్కింది.. ఇందులో ఏపీ నుంచి టిడిపికి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉండగా, తొలిసారి బిజెపి అభ్యర్థిగా నరసాపురం నుంచి విజయం సాధించిన శ్రీనివాస వర్మ కూడా మోదీ తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మంత్రి పదవులు దక్కించుకున్నారు.ఏపీ బీజేపీ నుంచి అందరూ పురందేశ్వరికి ఛాన్స్ దక్కుతుందని అంచనా వేయగా, అనూహ్యంగా నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కంటే పార్టీలో సామాన్య కార్యకర్తకు అవకాశం కల్పించారు.