
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. ఇవాళ ప్రత్యేక విమానంలో ఎంపీ సీఎం రమేష్‌తో కలిసి విశాఖకు విచ్చేశారు. అక్కడి నుంచి అనకాపల్లి గవరపాలెం అధినేత నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు జనసేన పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు అనకాపల్లిలో వెంటనే జరిగిన బహిరంగ సభలో గెలిచిన నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ అమ్మవారిని దర్శించుకుని పవన్ కల్యాణ్ పూజలు నిర్వహించారు.
- అక్కడ నుంచి పిఠాపురం చేరుకున్న పవన్ కల్యాణ్
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పవన్ పిఠాపురం బయలుదేరారు. పిఠాపురంలో పార్టీ నేతలతో కీలక సమయంలో. టీడీపీ జనసేన నేతల మధ్య నెలకొన్న అసంతృప్తుల నేపథ్యంలో పవన్ వారితో సమావేశం నిర్వహించారు. ఇరు పార్టీ నేతలతో జనసేనాని మాట్లాడనున్నారు.
అనకాపల్లి శ్రీ నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన పవన్ కళ్యాణ్. https://t.co/QizpBrTIE2 pic.twitter.com/eLYfKImWj1
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) జూన్ 10, 2024