Thursday, February 26, 2026
Home » కాకముందు డైరెక్టర్ నాగ్ అశ్విన్ నటించిన సినిమాలేవో తెలుసా..? – Sravya News

కాకముందు డైరెక్టర్ నాగ్ అశ్విన్ నటించిన సినిమాలేవో తెలుసా..? – Sravya News

by News Watch
0 comment
కాకముందు డైరెక్టర్ నాగ్ అశ్విన్ నటించిన సినిమాలేవో తెలుసా..?


ప్రస్తుతం ఎక్కడ చూసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ (నాగ్ అశ్విన్) పేరు మారుమోగుతోంది. ప్రభాస్ (ప్రభాస్) హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 AD’ (కల్కి 2898 AD) చిత్రం తాజాగా విడుదలై, విజువల్ గా హాలీవుడ్ రేంజ్ లో ఉందనే టాక్ తెచ్చుకుంది. నాగ్ అశ్విన్ విజన్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ఇండియన్ సినిమాకి మరో రాజమౌళి దొరికాడని అంటున్నారు. నాగ్ అశ్విన్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాకముందు డైరెక్టర్ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నాగ్ అశ్విన్ నటించాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 2008లో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘నేను మీకు తెలుసా’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు నాగ్ అశ్విన్. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర ‘లీడర్’ (2010), ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ (2012) సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇలా తాను అసిస్టెంట్ గా పని చేసిన మూడు సినిమాల్లోనూ నాగ్ అశ్విన్.. చిన్న చిన్న పాత్రలు పోషించడం.

2015లో నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. మొదటి సినిమాతోనే మెప్పించాడు. రెండో సినిమా ‘మహానటి’తో ఘన విజయాన్ని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇప్పుడు మూడో సినిమా ‘కల్కి’తో సంచలనాలు సృష్టిస్తున్నాడు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch