తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్న నేతల ఆశలపై నీళ్లు చల్లేలా సీఎం రేవంత్ రెడ్డి గురువారం వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన అధిష్టానంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎటువంటి ఆలోచన లేనట్లు అధిష్టానానికి ఆయన ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలన్న ఉద్దేశంతో చాలామంది రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చూస్తున్నారు. మూడు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బిజెపి, కెసిఆర్ కలిసి కుట్రలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని, ఎంపీ ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించారని రేవంత్. కాంగ్రెస్ పార్టీలో ఏదో జరిగితే వేడుక చూద్దామని చాలామంది అనుకుంటున్నారని. పిసిసి అధ్యక్ష పదవిని, సిఎం పదవిని సమన్వయం చేయడంలో నేతలతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని ఈ సందర్భంగా రేవంత్ పేర్కొన్నారు.
ఈ మధ్యకాలంలో కొన్ని అనుకోని ఘటనలు జరిగినట్లు ఆయన వివరించారు. వాటిల్లో జీవన్ రెడ్డి ఇష్యూ కూడా ఉందని పేర్కొన్నారు. సమస్య గుర్తించిన వెంటనే జీవన్ రెడ్డికి నేతలు ఫోన్లు చేశారన్న తర్వాత రేవంత్ రెడ్డి వివరించారు. జీవన్ రెడ్డి అనుభవాన్ని, విధేయతను ఎలా ఉపయోగించుకోవాలో కాంగ్రెస్ అధినాయకత్వానికి బాగా తెలుసు అన్న రేవంత్ రెడ్డి.. ఆయన గౌరవానికి ఎక్కడ భంగం కలిగించే పరిస్థితి ఉండదన్నారు. సీనియర్లు ఎవరికి అటువంటి భావన అవసరం లేదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై వస్తున్న ఊహాగానాలను కూడా రేవంత్ రెడ్డి కొట్టి పారేశారు. ఇంతవరకు అధిష్టానంతో చర్చించలేదని. మంత్రివర్గంలో అసలు ఖాళీలు లేవని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పుడు అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారని తెలిపారు. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి పని చేశానని రేవంత్ రెడ్డి చేశారు. వచ్చేనెల ఏడో తేదీతో తన అధ్యక్ష పదవీ కాలం ముగుస్తుందని. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో మంత్రివర్గ విస్తరణ పై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలకు షాక్ తగిలినట్టు అయింది. మంత్రి మండలిలో చోటు దక్కుతుందని భావించిన ఆయా నేతలు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడాల్సి ఉంది.