Wednesday, February 25, 2026
Home » ప్రభాస్ ఆరోగ్యం విషయంలో ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్! – Sravya News

ప్రభాస్ ఆరోగ్యం విషయంలో ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్! – Sravya News

by News Watch
0 comment
ప్రభాస్ ఆరోగ్యం విషయంలో ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్!


సినిమా హీరోలకు అభిమానులు ఉంటారు, అభిమాన సంఘాలు ఉంటాయి. తమ అభిమాన హీరోని ఇంట్లోవారి కంటే ఎక్కువగా అభిమానిస్తారు. ఇది హీరోల విషయంలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. హీరోయిన్లను కూడా అభిమానిస్తారు. కానీ, హీరోలతో ఉన్నంత ఎటాచ్‌మెంట్‌ వారిపై చూపించారు. తమ అభిమాన హీరో సంతోషంగా ఉండాలని, వాళ్ళు ఎలాంటి టెన్షన్స్‌ పడకూడదని భావిస్తున్నారు. దానికి ఉదాహరణ ఇటీవల కన్నడ ఇండస్ట్రీలో జరిగిన దర్శన ఘటన. ఒక విషయంలో తమ హీరోయిన్ టెన్షన్ పెడుతోందనే కారణంతో ఆ హీరోయిన్ ని ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇక డార్లింగ్‌ ప్రభాస్‌ విషయానికి వస్తే.. అలాంటి వీరాభిమానులు ప్రభాస్‌కి ఎంతో మంది ఉన్నారు.

తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో అభిమానులని ఎంతో బాధిస్తోందని వారి కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. జూన్ 27న ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ ‘కల్కి’ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొనే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌తో ఎంతో ఉత్సాహంగా కనిపించారు ప్రభాస్. దీనికి సంబంధించి విడుదలైన ఓ వీడియోలో స్టేజ్‌పై దీపికా పదుకొణె పక్కన నిలబడి ఉన్నప్పుడు ప్రభాస్‌ ఒక్కసారిగా స్లిప్‌ అయినట్టు కనిపించింది. అయితే దాన్ని తన నవ్వుతో కవర్‌ చేశారు ప్రభాస్‌. ఈ వీడియో వైరల్ కావడంతో గతంలో ప్రభాస్‌కి తగిలిన గాయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఆ గాయం ఇంకా సెట్ అవ్వలేదని బాధపడుతున్నారు.

‘అన్నా మాకు సినిమాలు వద్దు. నువ్వు ఆరోగ్యం చూసుకో’ అంటూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్. బాహుబలి షూటింగ్‌లో ఉన్నప్పుడే ప్రభాస్ కాలికి గాయమైందన్న వార్త అప్పట్లో వినిపించింది. ఆ తర్వాత సాహో, సలార్ షూటింగ్ సమయంలో కూడా గాయమైంది. దాని చికిత్స కోసం స్పెయిన్ వెళ్లిన ప్రభాస్ అక్కడ కాలికి సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత రెండు నెలలు విశ్రాంతి కూడా తీసుకున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో చూస్తుంటే అది ఇంకా సెట్ అవ్వలేదని అర్థమవుతోంది. ప్రస్తుతం లేటెస్ట్‌ మూవీ ‘కల్కి’ రిలీజ్‌ హడావిడిలో ఉంది కాబట్టి ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్‌ యూరోప్‌ వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మళ్ళీ సర్జరీ చేయించుకొని అంతా సెట్ అయిన తర్వాతే షూటింగ్‌కి వెళ్తారని సమాచారం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch