7
దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం జరుగుతున్నాయి. యూపీఎస్సీ ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి 30 నిమిషాలు ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్షా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతోపాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకెళ్లాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.