8
రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న మూవీ ఇది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఫస్ట్ తెలుగు సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీగా గేమ్ ఛేంజర్‌ను మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు.