దావోస్ లో తెలంగాణ సీఎం పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 13న ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ క్రీడావిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీని పరిశీలించనున్నారు. సెప్టెంబర్ 13వ తేదీ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆస్ట్రేలియా బయలు దేరుతారు. జనవరి 14, 15, 16, 17 తేదీల్లో ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. నవంబర్ 18న సింగపూర్ చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ షాపింగ్ మాల్స్, క్రీడా ప్రాంగణాల నిర్మాణాలను పరిశీలించనున్నారు. సింగపూర్‌లో జరిగే పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారు. అనంతరం ఈ నెల 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్ సదస్సుకు వెళ్లనున్నారు. అక్కడ ఈ నెల 21 నుంచి 23 వరకు ఉంటుంది.