ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఆర్థిక శాఖ నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా అన్నీ కలుపుకొని రూ.14 లక్షల కోట్ల అప్పులు రాష్ట్ర కేబినెట్ ముందు ప్రాథమిక నివేదిక ఉంచింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు కూటమి వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం మంత్రివర్గం తొలిసారిగా సమావేశమైంది. ఈ భేటీలో సూపర్ సిక్స్ పథకాలపై చర్చించనున్నారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు.. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్‌పై తొలి 5 సంతకాలు చేశారు. ఈ సమావేశంలో వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.