రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చి హామీలను అమలు చేస్తూ.. ప్రగతి పథంలో తెలంగాణ దూసుకెళ్తోందని అధికార పార్టీ నేతలు చెబుతుంటే.. గులాబీ లీడర్లు మాత్రం ‘ఇదేనా మార్పు’ అంటూ విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన పాలనలో పల్లె ప్రగతి లేదు.. పట్టణ ప్రగతి లేదని కామెంట్ చేశారు. ముందుచూపు లేని ముఖ్యమంత్రితో రాష్ట్రానికి అతీగతీ లేదన్నారు. ‘పల్లె ప్రగతి’తో మొన్నటి దాకా మురిసిన పల్లెలు నేడు మురికి కూపాలను తలపిస్తున్నాయని ఆరోపించారు. ‘పట్టణ ప్రగతి’తో పరుగులు తీసిన పట్టణాలు.. నేడు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో పల్లె ప్రగతి లేదు.. పట్టణ ప్రగతి లేదు: కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
22