10
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై తమిళనాడులో కేసు నమోదైంది. ఆమెపై పలు తెలుగు, తమిళ సంఘాలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే భారీ నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో చెన్నై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్లో నాలుగు సెక్షన్లతో ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ కస్తూరి క్షమాపణలు తెలిపారు.