Thursday, December 11, 2025
Home » ట్విట్టర్ వేదికగా టీడీపీ, వైసీపీ వార్.. ఖాతాల్లో ఆసక్తికరమైన పోస్టులు – News Watch

ట్విట్టర్ వేదికగా టీడీపీ, వైసీపీ వార్.. ఖాతాల్లో ఆసక్తికరమైన పోస్టులు – News Watch

by News Watch
0 comment
ట్విట్టర్ వేదికగా టీడీపీ, వైసీపీ వార్.. ఖాతాల్లో ఆసక్తికరమైన పోస్టులు


ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు నేతలను అరెస్ట్ చేయగా, గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్య వేడి వాతావరణం. తాజాగా మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఇరు పార్టీలు ట్విట్టర్ వేదికగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. బుధవారం ఉదయం టీడీపీ ట్విటిట్టర్‌ ఖాతాలో ఆసక్తికరమైన పోస్టును చేసింది. ఇందులో బిగ్ ఎక్స్‌పోజ్ కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 గంటలకు అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్టు రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ పోస్టు పెట్టిన తరువాత రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధినేత జగన్‌కు సంబంధించి కీలక అడుగు వేసే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఈ పోస్టు తర్వాత వినిపించాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణానికి సంబంధించి సిఐడి అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో లభించిన కీలక ఆధారాలను బయటపెడతారా..? లేక వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తారా.? అన్న చర్చ జరుగుతోంది. లేకుంటే ముఖ్య నేతలకు సంబంధించిన ఏదైనా కీలక విషయాలను వైసీపీ బయటపెడతారా..? అన్న చర్చ జరుగుతోంది. ఒకవైపు టీడీపీ అధికారికంగా వచ్చిన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఈ పోస్ట్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సమయంలోనే వైసీపీ కూడా మరో ఆసక్తికరమైన పోస్ట్‌ను ట్విట్టర్‌ ఖాతాలో చేసింది.

ఈ పోస్ట్‌లో బిగ్ రివీల్.. 24 అక్టోబర్ 12 గంటలకు పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పోస్టు పెట్టిన కొద్ది గంటల్లోనే వైసీపీ కూడా ఈ పోస్టు పెట్టడంతో ఆసక్తి నెలకొంది. టీడీపీ అంటే అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదైనా విచారణకు సంబంధించిన అంశాలను బయటపెట్టే అవకాశం ఉందని భావించవచ్చు. కానీ, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. వైసీపీ ఎటువంటి అంశాలను వెల్లడిస్తుందన్న ఆసక్తి. ఇదే ఇప్పుడు ఇరు పార్టీలు మధ్య సామాజిక మాధ్యమాల్లో వార్‌కు కారణమైంది. ఇరు పార్టీలు జరుగుతున్న పోస్టులతో గురువారం ఏం జరుగబోతోందన్న చర్చ. ఏ ఇద్దరు కలిసినా ప్రస్తుతం ఏపీలో ఇదే విషయం గురించి చర్చిస్తున్నారు. చూడాలి మరి టీడీపీ, వైసీపీలు చేసిన ఈ పోస్టులకు వెనుక ఉన్న అంశాలు ఏంటో గురువారం తెలియనుంది. ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా మాట్లాడడం లేదు. వెయిట్‌ అండ్‌ సీ అంటూ మరింత ఉత్కంఠను పెంచుతున్నారు.

భారీ కారు ప్రమాదం.. అయినా ఆఫీస్‌కు రావాల్సిందేనన్న బాస్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
డెలివరీకి ముందు, తర్వాత గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch