6
తోట్లవల్లూరు మండలం రోయ్యురు ఇసుక క్వారీలో ఎడ్ల బండ్లకు చెందిన ఇరు వర్గాల మద్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో నలుగురుకి గాయాలయ్యాయి. ఇరువర్గాలవారు కరలతో దాడి చేసుకున్నారు. మోర్ల శివ సాయి.. అతని బావమరిదిపై దాడి చేసిన జస్వంత్, ఈశ్వర్, శివసాయి కి తలపై తీవ్ర గాయాలు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఐలూరు, కలంవారిపాలెం, చాంగింటిపాడు, బద్రిరాజుపాలెం గ్రామాలలో రాత్రి పూట ఎడ్ల బళ్ళు ద్వారా ఇసకను తీసుకెళ్ళి ట్రాక్టర్ లో లోడ్ చేస్తున్నారు. రాత్రి సమయంలో ఏడ్ల బళ్లకు డేంజర్ స్టిక్కర్లు లేకపోవడం వల్ల వాహన దారులు తరచూ ప్రమాదాలు జరిగి గాయాలు పాలు అవుతున్నారు. రెవిన్యూ అధికారులు పటించు కోవడం లేదని ప్రజలు వాపోయారు.