Saturday, March 14, 2026
Home » తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం : కేటీఆర్‌

తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం : కేటీఆర్‌

0 comment

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా అని నిలదీశారు. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యమని, ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకు లేదా అన్నారు. బతుకమ్మ చీరెలను రద్దు చేశారు.. ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా అని ఎక్స్‌ వేదిగా నిలదీశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch