7
తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన తెలంగాణకు నిత్యస్ఫూర్తి అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం తాను బయలుదేరిననాడు నాటి ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వాల ఒత్తిడికి తలొగ్గకుండా బాపూజీ తన జలదృశ్యం నివాసాన్ని ఉద్యమవేదికగా నిలపడం తన తెలంగాణ పోరాట ప్రస్థానంలో మరిచిపోలేనిదని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.