Wednesday, March 25, 2026
Home » అప్పుల్లో ఉన్నాం.. వడ్డీ తగ్గించండి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

అప్పుల్లో ఉన్నాం.. వడ్డీ తగ్గించండి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
అప్పుల్లో ఉన్నాం.. వడ్డీ తగ్గించండి - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • కుదిరితే పూర్తిగా లేదా పాక్షికంగానైనా తగ్గించండి
  • అందుకు కేంద్ర ప్రభుత్వ రంగ ద్రవ్య సంస్థలను ఒప్పించండి
  • పార్లమెంటులో చెప్పిన నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు, క్లియరెన్సులివ్వండి
  • ఢిల్లీలో 8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ సదస్సులో మంత్రి ఉత్తమ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థికంగా మారినందున వాటిపై విధించిన వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ రంగ ద్రవ్య సంస్థలను ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైతే మొత్తంగా క్లియర్ చేయాలని, లేదా పాక్షికంగానైనా మాఫీ చేయాలని కోరినట్లు తెలిపారు.మంగళవారం న్యూ ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ అంతర్జాతీయ వాటర్ వీక్ సదస్సు-2024లో ఆయన పాల్గొన్న తెలంగాణలో ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఏటా దాదాపు ఆరు లక్షల ఎకరాల మేర కొత్త కట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రూ. 29 వేల కోట్లను ఈ రంగానికి కేటాయించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఙప్తి చేశారు.

ఇది వరకు దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పెంపొందించడం కోసం రూ. లక్షల కోట్లు కేటాయిస్తామని పార్లమెంటులో ప్రకటినట్టు.. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం అదే స్థాయిలో కేటాయింపులు జరిగాయి. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధుల రూపంలో సాయం అందడంతో పాటు వివిధ రకాల క్లియరెన్సులను కూడా త్వరితగతిన ఇచ్చేలా చొరవ తీసుకోవాలన్నారు. అలాగే పలు సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సాఫ్ట్‌వేర్ లోన్ కావాల్సిందిగా ఆ రెండు సంస్థల ప్రతినిధులతో చర్చించామన్న ఆయన రాష్ట్ర తలపెట్టిన సమ్మక్కసారలమ్మ ఇరిగేషన్ ప్రాజెక్టులోని కొంత ముంపు భాగం చత్తీస్‌గడ్ రాష్ట్ర పరిధిలో ఉన్నందున దీన్ని చేయడానికి, కేంద్రం నుంచి క్లియరెన్సులు రావడానికి ఆ రాష్ట్రం నుంచి ఎన్ ఓ సీ రావాల్సి ఉంది. , ఆ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి కేదార్ కశ్యప్‌తో చర్చలు జరిపారు. చత్తీస్‌గడ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వమూ చొరవ తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌తో ఈ విషయంతో పాటు రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి గత అప్పులపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం లేదా తగ్గించాలని, చత్తీస్‌గడ్ నుంచి ఎన్ ఓ సీ లభించేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో 40 దేశాల ప్రతినిధులతో పాటు మన దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, నిపుణులు, పాలసీ మేకర్స్ ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch