7
ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక సూచనలు చేసింది. వరదలతో నీరు నిల్వ ఉండటం వల్ల పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పేర్కొంది. ఇలాంటి సమయంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలంది. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. వేడి నీరు తాగాలని పేర్కొంది. ఇంటి పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, టైర్లు, కూలర్లలో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పారబోయాలని వెల్లడించింది.