ఆదిభట్ల,నాదర్గుల్ మధ్యలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ భూమిపూజ కార్యక్రమంలో మంగళవారం నకిలీ విలేఖరులు హల్చల్ సృష్టించారు. వివరాల్లోకి వెళితే చదువు,సంధ్యాలేని కొంతమంది జూదగాళ్లు రిపోర్టర్లు అవతారం ఎత్తి స్థానిక రిపోర్టర్లమని వెంచర్ యజమాని వద్ద దాదాపు 20వేల రూపాయలు డిమాండ్ చేసి చివరకు 11000 వేలు తీసుకొని వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక రిపోర్టర్లు వెంచర్ వద్దకు వెళ్లి యజమాని దగ్గర వివరాలు తీసుకుని అటుగా వెళుతున్న నకిలీ రిపోర్టర్ ను పట్టుకునే క్రమంలో బైక్ల పైన పరారైనట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానిక రిపోర్టర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కేటుగాళ్ల కోసం స్థానిక పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది…. ఈ నకిలీ రిపోర్టర్లు ఎల్బినగర్ చెందిన వాళ్ళుగా అనుమానిస్తున్నారు
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విలేకరులు హల్చల్
5