Sunday, March 15, 2026
Home » సీక్రెట్‌ కెమెరాల ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ

సీక్రెట్‌ కెమెరాల ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ

0 comment

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్‌ కళాశాలలో సీక్రెట్‌ కెమెరాలున్నాయనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ వెల్లడించారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని తెలిపారు. నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను పోలీసులు పరిశీలించారన్నారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు బయటపడలేదని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch