Thursday, February 19, 2026
Home » సీఎం రేవంత్‌ జైలుకు వెళ్లే ప్రమాదం: సీపీఐ నేత నారాయణ

సీఎం రేవంత్‌ జైలుకు వెళ్లే ప్రమాదం: సీపీఐ నేత నారాయణ

0 comment

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బడా బాబుల ఒత్తిడితో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళే ప్రమాదముందంటూ వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలన్నారు. హైడ్రాతో బడా బాబులు అయినా జైలుకు వెళ్ళాల్సి వస్తుందని… లేదా వాళ్ల ఒత్తిడితో రేవంత్ రెడ్డి అయినా జైలుకు వెళ్లే ప్రమాదముందని అన్నారు. రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నారని.. మధ్యలో ఆపేస్తే పులి తినేస్తుందని అన్నారు. అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళలో ఒక్క విజయ్ మాల్యా తప్ప మిగితా అందరూ గుజరాత్ వాళ్లే అని అన్నారు. ప్రధాని మోదీ దయాదాక్షిణ్యాల వల్ల అదానీ పెరిగారన్నారు. ఆయన సొంతంగా ఎదగలేదన్నారు. సెబీ కూడా అదానీకి దాసోహం అయ్యిందన్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యను విచారణ చేయవచ్చని ఆ రాష్ట్ర గవర్నర్ చెప్పారన్నారు. గవర్నర్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ మోడీని మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎన్ కన్వెన్షన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బుసకొట్టి ఊరుకున్నారన్నారు. హైడ్రా పనితీరు అభినందనీయమని కొనియాడారు. ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి.. చెరువు నిర్మాణం చేయాలన్నారు. నాగార్జున బఫర్ జోన్‌లో.. కాదు ఎఫ్‌టీఎల్‌లోనే నిర్మాణం చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆఫీస్‌లు కూడా కూల్చాలని ఎంఐఎం అంటోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయన్నారు. ప్రైవేటు నిర్మాణలును ప్రభుత్వ సంస్థలతో పోల్చడం తప్పు అని నారాయణ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch