ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభవార్త చెప్పారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సైన్స్ ఫెయిర్, క్రీడా పోటీలను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించాలని, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన కిట్లను అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో ఏ స్థాయిలో అయినా ప్రశ్నాపత్రాలు లీక్ అయినా కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోందన్న మంత్రి లోకేష్.. స్కూళ్లలో ఆయాలు, వాచ్‌మెన్‌లకు పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనకాపల్లి అనాధాశ్రమంలో కలుషిత ఆహారం తీసుకుని ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, సుమారు 42 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా నిరంతరం తనిఖీలను చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
యువత నైపుణ్య గణన చేపట్టేందుకు ఏర్పాట్లు
యువతలో నైపుణ్యాలను గుర్తించేందుకు నైపుణ్య గణన ప్రక్రియను చేపట్టబోతున్నట్లు మంత్రి. పరిశ్రమల యజమానులు, జాబ్ పోర్షన్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన గణనకు సలహాలు అందించారు. సర్వే ద్వారా వివరాలతో యువత విద్యార్హతలు, ఉపాధి నైపుణ్యాలను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువత ప్రముఖ కంపెనీలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. అప్పుడు ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యమున్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. నైపుణ గణన ప్రక్రియను మంగళగిరి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. స్కిల్ సెన్సెస్ సర్వేతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పెద్దలు, జాబ్ పోర్టల్ నిర్వాహకులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం నైపుణ్య గణన చేయబోతున్నట్లు మంత్రి ఏర్పాటు చేశారు. అధికారులు సహకారాన్ని అందించాలని సూచించారు.
అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చింది రాజకీయాల్లో కాదు.. పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించిన మామ చంద్రశేఖర్ రెడ్డి
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్