Sunday, March 15, 2026
Home » తిరుపతిలో అనాథ బాలికపై అత్యాచారం

తిరుపతిలో అనాథ బాలికపై అత్యాచారం

0 comment

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో తిరుపతిలో అనాథ బాలికపై అత్యాచారం జరిగింది. తిరుపతి జువైనల్ హోమ్ లో నేర చరిత్ర కలిగిన బాలికలతో పాటు అనాథ బాలికలు కూడా ఉంటున్నారు. స్థానిక నెహ్రూ మున్సిపల్ స్కూల్ లో బాధితురాలు అయినా బాలిక 9వ తరగతి చదువుతోంది. రిషి అనే యువకుడు స్టడీ అవర్ సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒంటిపై గాయాలతో జువైనల్ హోమ్ కు వెళ్లిన బాలికను తోటి విద్యార్థులను సిబ్బంది ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయాన్ని వారికి బాధితురాలు వివరించింది. ఈ క్రమంలో జరిగిన ఘటనపై వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch