అనకాపల్లి జిల్లాలో వరసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు రోజుల క్రిందట అనకాపల్లి నిర్మాణం పరవాడ ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలో సంభవించిన ప్రమాదంలో 17 మంది చికిత్స పొందుతున్నారు, 62 మంది గాయాలపాలె చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగి రెండు రోజులు కూడా గడవకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి సెజ్‌లోని సినర్జన్ యాక్టివ్ ఇన్‌గ్రిడియంట్స్ సంస్థలో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయాలు కాగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ప్రస్తుతం విశాఖ ఇండస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవ అందించాలని అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇతర ప్రాంతాలకు మెరుగైన వైద్యం కోసం తరలించాలని. బాధితులతోనూ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఈ ప్రమాదం జరిగింది. సినర్జన్ యాక్టివ్ ఇన్‌గ్రీడీయంట్స్ సంస్థలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురు జార్ఖండ్ కు చెందిన వారిగా పేర్కొన్నారు.
ఒకరు విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. హోం మంత్రితోపాటు ఇతరులతో వెంటనే ప్రమాదం జరిగిన పరిశ్రమకు వెళ్లి సమీక్షించాలని. బాధితులను కూడా పరామర్శించాలని సీఎం చంద్రబాబు నాయుడు హోం మంత్రిని తీసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అచ్యుతాపురం సెజ్ లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఈ ప్రాంతం వాసులు భయాందోళనకు గురవుతున్నారు. భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వలన ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రమాదాలను నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటిష్టమైన తనిఖీలను చేయకపోవడం, ఆడిట్ నిర్వహించకపోవడం వలన ఇటువంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. పరిశ్రమల్లో భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరుతోంది. తాజా ప్రమాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పరిశ్రమలపై సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Sun screen : సన్ స్క్రీన్ ఎడా పెడా వాడేస్తున్నారా..అయితే ఈ విషయం తెలిస్తే షాక్ తినడం ఖాయం
మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో టాప్ 10 దేశాలు ఇవే..