25
పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం, జాన్ పహాడ్ తండాకు చెందిన ఏలేటి వెంకట్ రెడ్డి తనకున్న మూడెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. వెంకట్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి తనకున్న భూమిని జాటోత్ వీరన్నకి విక్రయించాడు. వాయిదా పద్దతిలో డబ్బులు చెల్లిస్తూ భూమిని వశం చేసుకున్నాడు. కాగా ఆ భూమి సాగుకు అనుకూలంగా లేదని, పక్కనే ఉన్న వెంకట్ రెడ్డి భూమిని కబ్జా చేసి హద్దులు మార్చి ఈ భూమినే కొనుగోలు చేసినందుకు భయబ్రాంతులకు గురి చేయడం మొదలు పెట్టాడు. దౌర్జన్యాలు, దాడులకు పోలీసులు నిర్వహిస్తున్న నేపద్యంలో వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్ స్టేషన్‌లో వీరన్న అతని తమ్ముడు ఉపేందర్, అల్లుడు జర్పాల సురేష్, భార్య చిన్నిలపై పలు సెక్షన్ల కేసులు నమోదయ్యాయి.