13
సినీ నటులపై అసభ్యకర పోస్టులు, డార్క్ కామెడీ చేస్తున్న 18 యూట్యూబ్ ఛానళ్లను ‘మా’ బ్యాన్ చేయించింది. పది రోజుల క్రితం 5 ఛానళ్లను క్లోజ్ చేయించిన విషయం తెలిసిందే. తమ కళాకారులపై అవమానకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తోన్న YouTube ఛానెల్‌లను తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ‘మా’ ట్వీట్ చేసింది. యూట్యూబ్‌లో అసభ్యకర వీడియోలు పోస్ట్ చేస్తున్న వారు 48 గంటల్లో వాటిని తొలగించాలని హెచ్చరించారు.