Sunday, August 9, 2026
Home » 350 ఏళ్ల తరువాత స్వదేశానికి వచ్చిన ఛత్రపతి శివాజీ రహస్య ఆయుధం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

350 ఏళ్ల తరువాత స్వదేశానికి వచ్చిన ఛత్రపతి శివాజీ రహస్య ఆయుధం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 350 ఏళ్ల తరువాత స్వదేశానికి వచ్చిన ఛత్రపతి శివాజీ రహస్య ఆయుధం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముఘల్ సామ్రాజ్యం అంతానికి నాంది పలికిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి చెందిన రహస్య ఆయుధం ‘వాఘ్ నఖ్’ ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది. లండన్‌లోని ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ ఆయుధాన్ని తాత్కాలికంగా ప్రాతిపదికగా తీసుకుని భారత్‌కు తీసుకొచ్చారు. 350 ఏళ్ల నాటి ఈ ఆ

యుద్ధాన్ని బుల్లెట్‌ప్రూఫ్ కవర్‌లో, భారీ సెక్యూరిటీ మధ్య మహారాష్ట్ర ప్రభుత్వం భారత్‌కు తెచ్చింది. సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు పెట్టారు. ఈ వేడుకకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర నాయకులు. ఏడు పాటు వాఘ్ నఖ్‌ను సందర్శకుల కోసం మ్యూజియంలో ఉంచుతారు.

చరిత్ర ఇదీ..
1649లో ఛత్రపతి శివాజీ బీజాపూర్ సుల్తాన్‌ను ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంతకుముందు బీజాపూర్ సేనాధిపతి అప్జల్ ఖాన్‌తో సమావేశమైన శివాజీ రహస్యంగా తన వద్ద దాచుకున్న వాఘ్ నఖ్‌తో అతడిని అంతమొందించాడు. ప్రతాప్‌గఢ్ కోటలో ఈ ఘటన జరిగింది. ఇది ప్రస్తుతం సతారా జిల్లాలో ఉండటంతో ప్రభుత్వం ఈ ఆయుధాన్ని ఇక్కడి మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచింది.

ఇక ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో శివాజీ ఆయుధం అంశం మీకు కలిసి వస్తుందని శివసేన (ఏక్నాథ్) శిండే వర్గం భావిస్తున్నారు. మరాఠా అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆయుధం తమ విశ్వసనీయతను పెంచుతుందని నమ్ముతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch