6
ముద్ర,విశాఖపట్నం:- విశాఖలోని గాజువాకలో ఉన్న ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్‌లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు. అగ్ని ప్రమాద తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నట్లు సమాచారం.
బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ వెనుక నివాసాల ప్రజలు భయబ్రాంతులకు చూస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. ఆధునిక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.