Friday, May 8, 2026
Home » వరంగల్ లో దారుణం.. నిద్రిస్తున్న కుటుంబంపై కత్తితో దాడి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

వరంగల్ లో దారుణం.. నిద్రిస్తున్న కుటుంబంపై కత్తితో దాడి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 వరంగల్ లో దారుణం.. నిద్రిస్తున్న కుటుంబంపై కత్తితో దాడి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



వరంగల్, ముద్ర ప్రతినిధి: వరంగల్ చెన్నారావుపేట 16 చింతల తండాలో గురువారం దారుణం జరిగింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్ని తన ప్రియురాలు దీపిక కుటుంబంపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి ఘటనలో దంపతులు బానోతు శ్రీనివాస్, సుగుణ అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు బానోతు మదన్, కుమార్తె దీపికకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి మెరుగైన చికిత్స ఆసుపత్రికి చికిత్స.

పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనివాస్, సుగుణల కుమార్తె దీపిక, నాగరాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ యువతి కుటుంబ సభ్యులకు చెప్పా పెట్టకుండా వారిద్దరూ ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండు నెలలకే దీపిక, నాగరాజుల మధ్య మనస్పర్థలు రావడంతో పోలీసులు పెద్దల సమక్షంలో విడిపోయారు. ప్రేమించిన యువతిని ఆమె కుటుంబ సభ్యులే తనకు దూరం చేశారనే కోపంతో నిందితుడు బుధవారం అర్ధరాత్రి 1:35 నిమిషాల సమయంలో కత్తితో ఇంటి బయట నిద్రలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో అక్కడికక్కడే ప్రియురాలి తల్లి సుగుణ మృతి చెందింది. చికిత్స పొందుతూ తండ్రి బానోతు శ్రీను చనిపోయారు. ప్రియురాలికి, ప్రియురాలు తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch