Saturday, May 2, 2026
Home » మంటల్లో కాలిన బెంగళూరు మెట్రోపాలిటన్ బస్సు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

మంటల్లో కాలిన బెంగళూరు మెట్రోపాలిటన్ బస్సు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 మంటల్లో కాలిన బెంగళూరు మెట్రోపాలిటన్ బస్సు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



బాగళూరు: బెంగళూరులోని ఎంజి రోడ్‌లోని అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద ఉదయం 9 గంటల ప్రాంతంలో బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్సు (రూట్ 144E) మంటల్లో చిక్కుకుంది. ఇంజిన్లో మొదట మంటలు కనిపించాయి. దీన్ని వెంటనే గుర్తించిన ప్రయాణికులంతా దిగిపోయారు. నడిరోడ్డులోనే బస్సు తగలబడింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్ లో మంటలు గమనించిన వెంటనే డ్రైవర్ అప్రమత్తమై ఇంజిన్ ను ఆపారు. ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. దీంతో ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పాయి. BMTC సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch