Saturday, October 19, 2024
Home » ఐదెకరాలకే రైతు భరోసా..? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఐదెకరాలకే రైతు భరోసా..? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 ఐదెకరాలకే రైతు భరోసా..?  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



రైతు భరోసా అమలుపై రాష్ట్ర సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల దృశ్య.. కొంత కటాప్ విధించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఐదెకరాల లోపు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికి ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అలాగే వ్యవసాయం, వ్యవసాయేతర భూములు, పంటలు వేసినా, వెయ్యకున్నా అన్నిటికీ రైతుబంధు నిధులు ఇచ్చిన గత సర్కార్ విధానాలకు స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇకపై వ్యవసాయ భూములు, పంటలు పండించే రైతులకు రైతు భరోసా సాయం అందుతుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 92 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని, వారికి ఐదెకరాల లోపే భూములున్నాయంటూ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం వారికే లబ్ది చేకూర్చాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రైతు భరోసా అమలుపై ఇప్పటికే నియమించబడిన కేబినెట్ సబ్‌ కమిటీ శుక్రవారం సచివాలయంలో తొలిసారిగా భేటీ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు

శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సంబంధిత శాఖాధికారులు ఉన్నారు. ఇందులో కమిటీ సభ్యులు రైతు భరోసా విధివిధానాలు, అమలు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే రైతుబంధు పథకం అమలులో గత ప్రభుత్వం అనుసరించిన విధివిధానాలు, మార్గదర్శకాలు కఠినతరం చేయాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్.. తాము అమలు చేయనున్న రైతుభరోసాలో ఎవరెవరికి అర్హులుగా ప్రకటించాలి..? ఎవరికి రైతు భరోసా ఇవ్వాలో అనేదానిపై రైతులు, రైతు సంఘాల నాయకులు, వివిధ వర్గాల అభిప్రాయాలు ఎవరికి అందించాలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో ఈనెల 11 నుంచి 16 వరకు జిల్లాల పర్యటనకు సిద్ధమైంది. చివరకు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రైతు భరోసాను అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలావుంటే..రైతు బందు నిధుల విడుదలలో గత ప్రభుత్వం హయాంలో రూ. 26వేల కోట్లు దుర్వినియోగమైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు సబ్ కమిటీకి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. దీనితో పాటు రాష్ట్రంలో ప్రస్తుత సాగుభూమి లెక్కలను అధికారుల కమిటీ ముందు ఉంచారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch