హైదరాబాద్, ఈవార్తలు: తెలుగు రాష్ట్రాలు విడిపోయిన పదేళ్లు పూర్తయిన పలు విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వాటి పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపగా, భేటీకి సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దీంతో నేడు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో వీరిద్దరు భేటీ అయ్యి విభజన సమస్యలపై చర్చించనున్నారు. తెలంగాణ డిమాండ్స్ ఏంటి? ఏపీ డిమాండ్స్ ఏంటి? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వచ్చిన డిమాండ్‌పై ఓ స్పష్టత ఉన్నట్లు తెలిసింది. ఆ డిమాండ్లనే సీఎంల భేటీ సందర్భంగా లేవనెత్తనున్నారు.
తెలంగాణ డిమాండ్స్ ఇవే..
– తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం రూ.24 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి.
– ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలి.
– తెలంగాణకు ఓడరేవులు లేవు. అందువల్ల ఏపీ తీరప్రాంతంలో తెలంగాణకు వాటా కల్పించాలి. విభజన చట్టంలో కేటాయించిన కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరంలో భాగం కావాలి.
– తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ తెలంగాణకు భాగం కావాలి.
– కృష్ణా జలాల్లో తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయించాలి.