2
భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందించిన సాయంపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించింది. ఇప్పటివరకు రూ.618 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. కొత్తగా 2,954 దరఖాస్తులు వచ్చాయని, అర్హత కలిగిన 1,646 మందిలో 850 మందికి శుక్రవారం వారి అకౌంట్లలో పరిహారం జమ చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. రెండు రోజుల్లో మిగిలిన వారికి పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.