21

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూలై 1వ తేదీ నుంచి పిఠాపురం నియోజకవర్గంలో ఉండనున్నారు. అదే రోజు పిఠాపురంలో వారాహి సభ నిర్వహించనున్నారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తారు.మూడు రోజుల పాటు పిఠాపురం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకినాడ జిల్లా అధికారులు పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక వసతులపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.