Saturday, April 4, 2026
Home » నేతాజీ నగర్ కాలనీలో రిపబ్లిక్ డేలు -News Watch

నేతాజీ నగర్ కాలనీలో రిపబ్లిక్ డేలు -News Watch

by News Watch
0 comment
నేతాజీ నగర్ కాలనీలో రిపబ్లిక్ డేలు


ముద్ర, హైదరాబాద్: మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నేతాజీ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జి అప్పారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, అంజిరెడ్డి, ఖలీద్ సర్వర్, కేవీబీ మురళీమోహన్ రావు, ఎంవీ రంగారెడ్డి, ఏ సత్యం బాబు, వై నరేందర్ రెడ్డి, ఏ కృష్ణమూర్తి, డాక్టర్ జనార్ధన్, డాక్టర్ వరప్రసాదరావు, ఆనందం, కే. పద్మా ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వహించినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టమవుతుందని అన్నారు. ఏ ఎన్నికల్లోనైనా నగరంలో పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదు కావడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకుండా వినియోగించుకోవాలని కోరారు. దేశ స్వాతంత్ర సముపార్జనకు ప్రాణ త్యాగం చేసిన అమరులకు, రాజ్యాంగ రూపకర్తలకు వారు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సోమేశ్ మిత్తల్, గంగాధరన్, మహమ్మద్ అబ్దుల్ మాలిక్, ఎం ఏ గపూర్ , వెంకటరమణ నిర్వహించారు.

క్రీడా పోటీలు

రిపబ్లిక్ డే సందర్భంగా నేతాజీ నగర్ రెసిడెంట్స్ రిక్రియేషన్ ఫోరం ఆదివారంనాడు షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. 50 ఏళ్ల పైబడిన విభాగంలో జేవీ చలపతి, కే రాజు జట్టుపై మొహమ్మద్ అబ్దుల్ మాలిక్, పి ఉమేష్ కుమార్ జట్టు విజేతగా నిలిచారు. 50 ఏళ్ల దిగువ భాగంలో రవితేజ, రత్నం జట్టుపై జే. శ్రీనాథ్, మోహన్ రెడ్డి జట్టు విజయం సాధించింది. విజేతలకు, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లకు నేతాజీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ట్రోఫీలు ప్రకటించారు.

ఈ ప్రకటన రిక్రియేషన్ ఫోరం అధ్యక్షుడు కేవీ బి మురళీమోహన్ రావు అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షుడు ఎంవీ రంగారెడ్డి, ఫోరం కార్యవర్గ సభ్యులు వై రవీందర్ రెడ్డి ఉన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. అప్పారావు, ఉపాధ్యక్షులు అంజిరెడ్డి, ఖలీద్ సర్వర్ సర్వర్, అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఏ సత్యం బాబు, మాజీ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, కోశాధికారి అమర్నాథ్ రెడ్డి, అసోసియేషన్ నాయకులు కే ప్రభాకర్ సంజీవరెడ్డి కార్యక్రమంలో పాల్గొని బహుమతి ప్రదానం చేశారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలనీలోని బాలబాలికలకు కూడా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి అసోసియేషన్ నాయకులు బహుమతులు ప్రదానం చేశారు.

The post నేతాజీ నగర్ కాలనీలో రిపబ్లిక్ డే వేడుకలు appeared first on Mudra News.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch