Friday, November 22, 2024
Home » Actor Suriya: ప్రభుత్వంపై సూర్య సీరియస్.. ఇంకెన్నాళ్లీ విషం తాగాలి అంటూ! – Sravya News

Actor Suriya: ప్రభుత్వంపై సూర్య సీరియస్.. ఇంకెన్నాళ్లీ విషం తాగాలి అంటూ! – Sravya News

by News Watch
0 comment
Actor Suriya: ప్రభుత్వంపై సూర్య సీరియస్.. ఇంకెన్నాళ్లీ విషం తాగాలి అంటూ!










తమిళనాడులోని.. కళ్లకురిచ్చి జిల్లా కరుణపురంలో కల్తీ సారా తాగి.. 51 మంది మరణించారు.. ఇంకా 116 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో సుమారు 34 మంది వరకు పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని.. డాక్టర్లు చెబుతున్నారని.. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఈ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు… ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఇక ఈ ఘటనపై రాజకీయ నాయకుల దగ్గర నుంచి.. సినీ ప్రముఖుల వరకు అందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ హీరో సూర్య స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మిథనాల్ కలిపినా సారాయి త్రాగడం వలెనే.. ఈ మరణాలు సంభవించినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ మద్యం పేరుతో.. విషాన్ని తాగినట్లు.. వెంటనే ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని సూర్య ఇలా రాసుకొచ్చారు. “ఒక చిన్న పట్టణంలో వరుసగా 50 మంది చనిపోవడం తుఫానులు, వర్షాలు, వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా జరగని విషాదం. ఇంకా వంద మందికి పైగా హాస్పిటల్ లోనే కలకలం రేపుతోంది. వరుస మరణాలు, బాధితుల రోదనలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. కల్తీ మద్యానికి తమ వారిని కోల్పోయిన వారి రోదనలను ఏమాటలు ఓదార్చగలవు..? ఇప్పుడు రాజకీయ పార్టీలు, ఉద్యమాలు, మీడియా, ప్రజలు తమ దృష్టిని, ఆందోళనను, ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ప్రభుత్వం, పాలనా నిర్వహణ సత్వరమే చర్యలు చేపట్టి నష్టాలను తగ్గించుకునేందుకు, ఓదార్పునిస్తుంది.

కానీ దీర్ఘకాలిక సమస్యకు స్వల్పకాలిక పరిష్కారం అనేది పనిచేయదు. గత ఏడాది విల్లుపురం జిల్లాలో మిథనాల్ కలిపిన నకిలీ మద్యం తాగి 22 మంది చనిపోయారు . ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు మరో జిల్లాలో కూడా అదే మిథనాల్ కలిపిన కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోయారు. ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాకపోవడం చాలా బాధాకరం. తమ బతుకులు బాగుపడాలని ఓట్లు వేసే తమిళనాడు ప్రజలు, ఇరవై ఏళ్లకు పైగా మనల్ని పాలించిన ప్రభుత్వాలు టాస్మాక్ పెట్టి ప్రజలను బలవంతంగా తాగించే దుస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ‘మద్యపాన విధానం’ అనేది అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయం నినాదంగా ఉపయోగపడుతుంది.

టాస్మాక్‌లో రూ.150కి తాగే మందు బాబులు డబ్బులు లేని సమయంలో రూ.50కి లభించే నకిలీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మద్యపానం చేసేవారికి సమస్య కాదు.. ప్రతి కుటుంబానికి, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య అని మనందరం ఎప్పుడు గ్రహిస్తాం?. ప్రభుత్వాలు స్వయంగా మద్యపానాన్ని ప్రోత్సహించి 2 సంవత్సరాలుగా సొంత ప్రజలపై చేస్తున్న హింసను వెంటనే ఆపాలి. మద్యానికి బానిసైన వారిని బయటకు తీసుకురావడానికి ప్రతి జిల్లాలో పునరావాస కేంద్రాలు ప్రారంభించాలి. విద్యార్ధుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం దర్శనికతతో కూడిన.. కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లే, మద్యపాన వ్యసనపరుల పునరావాసానికి కూడా ఆదర్శప్రాయమైన కార్యక్రమాలను రూపొందించి.. ఉద్యమంలా అమలు చేయాలి.

ప్రభుత్వం, రాజకీయ పార్టీలు దూరదృష్టితో వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి మరణాలు అరికట్టవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి స్వల్పకాలిక పరిష్కారాన్ని ఆమోదిస్తారని.. నిషేధ విధానంపై ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని ప్రజలతో పాటు నేను ఆశిస్తున్నాను. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టడంలో విఫలమైన పరిపాలనను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతులకు ప్రగాఢ సంతాపం. ఆసుపత్రిలో ఉన్నవారు కోలుకోవాలి. ఇకమీదట కొత్త చట్టం చేద్దాం. మేము దానిని ఎప్పటికీ రక్షిస్తాము ” అంటూ సూర్య భావోద్వేగంతో బహిరంగంగా ఓ లెటర్ ను రాశారు. దీనితో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి తమిళనాడుపై సూర్య స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి





You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch