Wednesday, February 25, 2026
Home » ఐటీ కారిడార్ లో గంజాయి విక్రయాలు … ఇద్దరు వ్యక్తులు అరెస్టు -News Watch

ఐటీ కారిడార్ లో గంజాయి విక్రయాలు … ఇద్దరు వ్యక్తులు అరెస్టు -News Watch

by News Watch
0 comment
ఐటీ కారిడార్ లో గంజాయి విక్రయాలు … ఇద్దరు వ్యక్తులు అరెస్టు


  • మరో కేసులో అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ అరెస్టు

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి, హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఆదివారం నాడు మాదాపూర్ సిద్ధిఖీ నగర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు గంజాయి విక్రయిస్తుండగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 830 గ్రామాల గంజాయి, 14 గ్రామాల హాష్ ఆయిల్, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా మాదాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్ రామ్ గూడలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు గంజాయి అలవాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ అరెస్టు

హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజును సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 62 కేజీ ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ సీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ మాట్లాడుతూ.. గాజువాక రాజు ఐస్ క్రీమ్ బిజినెస్ చేస్తున్నాడని, ఈజీ మనీకోసం గంజాయి పెడ్లర్ గా అవతారం ఎత్తాడన్నారు. మహారాష్ట్ర చంద్రాపూర్ లో మకాం మార్చాడని, చంద్రపూర్ లో పురుషోత్తం అనే వ్యక్తికి ఆర్డర్ పై ఇచ్చేందుకు గంజాయి తీసుకెళ్తున్నాడన్నారు. ఒరిస్సాకు చెందిన సుభాష్ అనే వ్యక్తి వద్ద విక్రయించి తరలిస్తుండగా తమకు సమాచారం రావడంతో పట్టుకున్నామని డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ పేర్కొన్నారు.

గంజాయిని తోలుతా ఒరిస్సా నుండి రామగుండం తీసుకువచ్చి అక్కడి నుండి బసులో హైదరాబాద్ చేరుకున్నాడని, హైదరాబాద్ నుండి చంద్రాపూర్ వెళ్లేందుకు బస్ కోసం చాదర్ ఘాట్ నల్గొండ చౌరస్తాలో అగి ఉన్నాడని ఆయన చెప్పారు. సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో గంజాయి తరలిస్తున్న రాజును అదుపులోకి తీసుకున్నారు. గతంలో రాజు గంజాయి సరఫరా చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తెలంగాణాలోని పాల్వంచ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. గతంలో వరుస గంజాయి కేసులలో జైలుకు వెళ్లిన రాజు తన బుద్ధి మారలేదు. గంజాయి పెడ్లర్ రాజు కాల్ డేటా, రిసీవర్లు ఎవరు. మెయిన్ పేడ్లర్ ఎంత మంది. సబ్ పెడ్లర్లు ఎవరు వారి నెట్ వర్క్ పై వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నామని డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ తెలిపారు.

The post ఐటీ కారిడార్ లో గంజాయి విక్రయాలు … ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ appeared first on Mudra News.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch