Thursday, March 26, 2026
Home » హస్తంలో ‘హస్తీనా’ చర్చ – Mudra News – News Watch

హస్తంలో ‘హస్తీనా’ చర్చ – Mudra News – News Watch

by News Watch
0 comment
హస్తంలో 'హస్తీనా' చర్చ - Mudra News


  • చర్చనీయాంశంగా టీపీసీసీ నేతల ఢిల్లీ టూర్
  • తెలంగాణ నేతలకు ఝలక్ ఇచ్చిన రాహుల్
  • సీఎం, టీపీసీసీ చీఫ్, మంత్రులకు సమయమివ్వని యువనేత
  • అదే రోజు పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ
  • కేసీ భేటీతోనే సరిపెట్టుకున్న తెలంగాణ నేతలు
  • ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవం, యువనేతను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ నేతలు
  • టీపీసీసీ నేతల వ్యవహార తీరుపై అధిష్టానం అసంతృప్తి..?
  • పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ మార్పు, ఎమ్మెల్యేలపై సీఎం సర్వేపై గుర్రు
  • రాష్ట్ర తాజా పరిణామాలపై వివరణ కోరిన హైకమాండ్
  • కలిసి ఉన్నామంటూనే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు..?
  • సీరియస్ గా తీసుకున్న అధిష్టానం
  • నేరుగా అగ్రనేతలతో టచ్ లో చాలా కీలక నేతలు
  • సీఎం, టీపీసీ చీఫ్ మధ్య లోపించిన సమన్వయంపై అగ్రనేతల అసంతృప్తి

ముద్ర, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ నేతల ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఢిల్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం..రాష్ట్ర రాజకీయాలు.. మంత్రివర్గ విస్తరణ.. నామినేటెడ్, కార్పోరేషన్ల పోస్టుల భర్తీ.. ఈ నెల 15న ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ నేతలను కలిసేందుకు యువనేత రాహుల్ గాంధీముఖత చూపడం హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో నూతన ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రతలు, సీఎంలు, మంత్రులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలందరినీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పలకరించారు.

కార్యక్రమం తర్వాత టీపీసీసీ నేతలు..రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించగా అపాయింట్ మెంట్ లభించలేదు.కానీ రాహుల్ గాంధీ ఏపీ టీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. ఆ రాష్ట్రంలో పార్టీ బలంగా, ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ఝలక్ తో ఖంగుతిన్న సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులతో యువనేతను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ వారిని కలిసేందుకు ఇష్టపడని రాహుల్ గాంధీ.. కేసీని కలిస్తే చాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయినా యువనేత అపాయింట్ మెంట్ కోసం బుధవారం సాయంత్రం వరకు వేచి చూసిన టీపీసీసీ నేతలు చివరకు ఏం చేయాలో తోచక రాత్రి 8గంటల ప్రాంతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసి రాష్ట్ర రాజకీయాలపై నివేదిక ఇచ్చారు.

అదే సమయంలో రాహుల్ గాంధీకి సమయం ఇవ్వకపోవడానికి గల కారణాలనూ తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే ఉన్నందున యువనేత కలవరనీ రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని కేసీ సూచించినట్లు తెలిసింది. అదే సమయంలో పార్టీలో వ్యక్తిగత ఆరోపణలతో పాటు పథకాలు అమలుపై ఏసీఐఎస్‌సీ పరిశీలన జరుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా కలిసి పని చేయడం మందలించినట్లు సమాచారం.

వివరణ ఇచ్చేందుకు టీపీసీసీ నేతలు ప్రయత్నించగా కేసీ..తెలంగాణలో ఏం జరుగుతుందో తమ వద్ద రిపోర్టు ఉందని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చివరకు కేసీతో భేటీ తర్వాత బయటకు వచ్చిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. సీఎం రేవంత్ రెడ్డి లేకుండానే మీడియాతో మాట్లాడడంపై పార్టీ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలనే మీడియాకు వివరించిన టీపీసీసీ చీఫ్..ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణ అంశం తమకు సంబంధించినది కాదని తేల్చి చెప్పారు. ఆ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ క్లారిటీ ఇవ్వడానికి వివరణ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.

రాష్ట్ర పరిణామాలపై ఐసీసీ అసంతృప్తి

తాజాగా రాష్ట్రంలో అధికార పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై ఐసీసీ అగ్రనేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. చూడడానికి కీలక నేతలందరూ తామంతా కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా విభేదాలు అలాగే కొనసాగుతున్నాయని నిర్థారణ అధిష్టానం. ఈ కొంత మంది మంత్రులు నేరుగా హైకమాండ్ తో టచ్ లోకి వెళ్లడంతో వారిపై అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూసుకునేందుకు ఇంఛార్జీ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డిలు నేరుగా ఎవరికి అధిష్టానం నుండి సంప్రదింపులు జరుపుతున్నట్లు అగ్రనేతలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏడాది కాలంగా ఊరిస్తోన్న మంత్రి వర్గ విస్తరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రులు ఢిల్లీ వేదికగా చేస్తున్న ప్రయత్నాలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

తమకు సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు ఏఐసీసీ నేతలతో మీకున్న పరిచయాలతో లాబీయింగ్ చేయడం వివాదస్పదంగా మారింది. ఉత్తర తెలంగాణలో ఒకరు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరొక ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం చేస్తున్న లాబీయింగ్ పై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ప్రస్తుతవర్గంలో ఓ సామాజిక వర్గానికి చెందిన మంత్రులే ఎక్కువగా ఉండగా..కేబినెట్ విస్తరణలోనూ అదే సామాజిక వర్గం నుంచి మరో వ్యక్తికి అవకాశం కల్పించాలని రాష్ట్ర నేతలు కోరుతున్నారు. ఇప్పటికే మరిన్ని మంత్రి పదవులు కోరుతూ మరో బలమైన సామాజికవర్గం నుంచీ డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో అధిష్టానం మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు.. ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి థర్డ్ పార్టీతో నిర్వహించిన సర్వేపై ఇప్పటికే అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే సొంత పార్టీ నేతలపై సీఎం నిర్వహించిన సర్వేపైనా పార్టీ హైకమాండ్ అసతృప్తితో ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షిని ఆద్యతల నుంచి తప్పిస్తున్నట్లు ఇటీవల జరిగిన ప్రచారంపైనా ఏఐసీసీ ఆరా తీసింది. దీని వెనక అధికార పార్టీ నేతలే గుర్తించారు ఏఐసీసీ గుర్తించింది. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదుగుతోన్న ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా టీపీసీసీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై అగ్రనేతలతో విశ్వసనీయంగా తెలిసింది. మొత్తానికి ఈ మొత్తం పరిణామాలతో ఢిల్లీలో అసలేం జరుగుతుంది..? టీపీసీసీ నేతలపై యువనేత అలకకు కారణాలేంటి అనే చర్చ హాటెక్కుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch