17
వారంతా కావడంతో హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ సాగర్ జలాశయం చూసేందుకు వెళ్లారు. ఈత కొట్టేందుకు డ్యాంలో దిగారు. వీరిలో ఐదుగురు గల్లంతుకాగా…ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గల్లంతైన వారి కోసం గాలించారు. ఇప్పటికే ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులు ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జనిత్ పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ధనుష్, లోహిత్ సొంత అన్నదమ్ములుగా. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి ఉంచారు.