Tuesday, December 9, 2025
Home » మందుబాబులకు బ్యాడ్‌న్యూస్ … బీర్లు బంద్ – Sravya News

మందుబాబులకు బ్యాడ్‌న్యూస్ … బీర్లు బంద్ – Sravya News

by News Watch
0 comment
మందుబాబులకు బ్యాడ్‌న్యూస్ … బీర్లు బంద్


  • బకాయిలు చెల్లించడం లేదన్న యునైటెడ్ బ్రూవరీస్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మందుబాబులకు షాక్‌ ఇచ్చినట్లుంది. ఇప్పటి నుంచి రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అవుతున్నాయి. కింగ్ ఫిషర్ బీర్లు తయారు చేసి సరఫరా చేస్తున్న యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. టీజీబీసీఎల్ బకాయిలు చెల్లించకపోవటమేనని బ్రూవరీస్ కంపెనీ సెబీకి రాసిన లేఖలో ఇచ్చింది. దీంతో.. ఇక నుంచి తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్లు సరఫరా చేయబోమని స్పష్టం చేసింది.

తెలంగాణ బెవరేజస్‌ కార్పొరేషన్‌ రూ.900 కోట్లు బకాయి ఉందని, 2019 నుంచి ధరలను సవరించకపోవడం లాంటి కారణాల వల్ల.. భారీ నష్టాలు వస్తున్నాయని బ్రూవరీస్‌ తన లేఖలో పేర్కొన్నారు. బ్రూవరీస్ తీసుకున్న ఈ నిర్ణయంతో వేసవికి ముందు.. రాష్ట్రంలోని కింగ్ ఫిషర్ బీర్ ప్రియులకు షాక్ ఇచ్చారు. మార్కెట్‌లో ఎన్నో పేర్లతో బీర్లు లభ్యమవుతున్నా.. చాలా మందికి బీర్ అంటే చాలు కింగ్ ఫిషర్ బీరే మొదట గుర్తొస్తుంది. కొంత మందికైతే కింగ్ ఫిషర్ బీర్ తప్ప మిగిలిన బ్రాండ్ల పేర్లు కూడా సరిగా తెలియదంటే అతిశయోక్తి కాదు. అలాంటి ప్రజాధరణ పొందిన కింగ్ ఫిషర్ బీర్లు ఇప్పుడు మొత్తానికే రావు అనే వార్త చాలా మంది యువతని ఆందోళనకు గురిచేస్తుంది.

ఆల్రెడీ షార్టేజ్

ఇప్పటికే తెలంగాణలో ప్రతి సమ్మర్‌లో కూల్ బీర్లు దొరకటం లేదని, అందులోనూ కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకడం లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పాటు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. వేసవి కాలంలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకటం లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన సందర్భాలు ఉన్నాయి. కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఏర్పడితేనే ఆగమాగమైన బీరు ప్రియులు.. ఇప్పుడు మొత్తానికే దొరకవు, అసలు మార్కెట్‌లోకి రావు అంటే పరిస్థితి ఊహించలేకపోతున్నారు. అందులోనూ మరో వారం రోజుల్లో సంక్రాంతి పండగ, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు, అటు తర్వాత వచ్చే వేసవి కాలం.. ఇలాంటి సమయంలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్ కావడంపై అప్పుడే ఆందోళన కూడా మొదలైంది. ఇక వేసవిలో అయితే.. జనాలు కొబ్బరి నీళ్ల కంటే ఎక్కువగా కింగ్ ఫిషర్ బీర్ నీళ్లు తాగేందుకే తహతహలాడుతుంటారు.

సరఫరా చేయడం

తెలంగాణ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా బంద్ యునైటెడ్ బ్రెవరీస్ సంస్థ ప్రకటన జారీ చేసింది. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో డిస్టిలరీస్ రేట్ల పెంపు ప్రతిపాదనలు అమోదించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదలైంది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్సెంట్ కి సంస్థ యాజమాన్యం లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ధరల పెరుగుదల లేకపోవడంతో, భారీ నష్టాలు వస్తున్నాయని యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించింది.

The post మందుబాబులకు బ్యాడ్‌న్యూస్ … బీర్లు బంద్ appeared first on Mudra News.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch