
- దేశంలోనే అదో చెత్త కేసు
- ఏసీబీ కేసు నమోదు చేయగానే ఈడీ నోటీసు ఇవ్వడమేంటి.?
- కాంగ్రెస్ మంత్రులు ఢిల్లీకి కప్పం కడుతున్నారు
- ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైన కేసు కుట్రపూరితమైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అది దేశంలోనే చెత్త కేసు అనీ అందులో ఒక్క పైసా అవినీతి కూడా జరగలేదు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడీ) నమోదు చేసిన కేసు రాజకీయ దురుద్దేశం దాగి వెనక లేదు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. ఆ కేసులో ఏసీబీ కేసు నమోదు చేయగానే ఈడీ నోటీసు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ రైతు డిక్లరేషన్ బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఏడాది పాలనలోనే రూ. లక్షన్నర కోట్లు అప్పులు చేశారన్నారు. అందులో కొంత మంది మంత్రులు దోచుకుని.. సగం ఢిల్లీకి కప్పం కట్టారని. రైతులకు ప్రభుత్వం నష్టాన్ని త్వరలో ఇంటింటికి తీసుకెళ్తామన్నారు. ప్రజాశాంతి పార్టీ బడుగు, బలహీన వర్గాలకు చెందిన పార్టీ అన్న కేఏ పాల్.. రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఊడిపోయే ముక్కు లాంటిదన్నారు. అది ఎప్పుడు ఊడిపోతుందో తెలియదని సెటైర్లు వేశారు. వర్గీకరణ కోసం మాలలు, మాదిగలు కొట్టుకుంటున్నారని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తానంటే చాలా ఇష్టమని ఆయన్ను ఐదు సార్లు కలిశానని చెప్పారు.సీఎంగా రేవంత్ రెడ్డి రూ. లక్ష కోట్లు అప్పు చేశారననీ మరో రూ. లక్ష కోట్లు అప్పు చేస్తారన్నారు.