Monday, March 23, 2026
Home » అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. 28 ఏళ్ళ తరువాత కలిశారు! – Sravya News

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. 28 ఏళ్ళ తరువాత కలిశారు! – Sravya News

by News Watch
0 comment
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. 28 ఏళ్ళ తరువాత కలిశారు!


1996లో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో పవన్ కళ్యాణ్ (పవన్ కళ్యాణ్), సుప్రియ యార్లగడ్డ (సుప్రియ యార్లగడ్డ) హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. 28 ఏళ్ళ తరువాత తాజాగా ఈ ఇద్దరు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 28 ఏళ్ల తరువాత కలిశారు” అంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ సమస్యల గురించి చర్చించడానికి తాజాగా నిర్మాతల బృందం పవన్ ని కలిశారు. వారిలో సుప్రియ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ తో సుప్రియ దిగిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 28 ఏళ్ళ క్రితం ఒకే సినిమాతో ఈ ఇద్దరు హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఇప్పుడు పవన్ రాజకీయాల్లోకి ప్రవేశించి, డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగగా.. సుప్రియ నిర్మాతగా మారారు. ‘అక్కడ అమ్మాయి’ ప్రొడ్యూసర్ గా మారితే.. ‘ఇక్కడ అబ్బాయి’ డిప్యూటీ సీఎం అయ్యాడన్నమాట.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch