12
రవీంద్ర భారతిని తలదన్నేలా కాళోజీ కళాక్షేత్రం నిర్మించాలంటూ రూ.50 కోట్లు కూడా ప్రకటించారు. శంకుస్థాపన చేసిన తరువాత సరైన సమయంలో నిధులు విడుదల కాకపోవడం వల్ల పనులు నెమ్మదించాయి. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోకపోవడం, కాళోజీ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పూర్తి చేస్తామంటూ హడావుడి చేయడం తప్ప పెద్దగా శ్రద్ధ పెట్టకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కాళోజీ కళాక్షేత్రం పనులు పూర్తి కాలేదు. దీంతో పదేళ్ల పాటు కాళోజీ కళాక్షేత్రం అసంపూర్తిగానే ఉండిపోయింది. ఏ ఎన్నిక వచ్చిన ప్రతిపక్షాలకు ఇదొక అస్త్రంగా మాత్రమే ఉపయోగపడింది.