Wednesday, February 25, 2026
Home » బండ్ల గణేష్ – సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ -Sravya News

బండ్ల గణేష్ – సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ -Sravya News

by News Watch
0 comment
 బండ్ల గణేష్ - సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ లో హీరా గ్రూప్ సీఈవో నౌహీరా షేక్ కు చెందిన రూ. 75కోట్ల విలువైన ఇల్లు కబ్జా అని గణేష్ పై గతంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నౌహీరా షేక్ ఫిలింనగర్ లోని తన ఇంటిని బండ్ల గణేష్ కు నెలకు రూ.లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చారు. క్రమంగా కిరాయి ఇవ్వకపోగా గూండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె గుర్తు చేసింది.

ఫిబ్రవరి 15న ఈ ఘటన చోటుచేసుకోగా.. ఫిలింనగర్ పోలీసులకు నౌహీరా షేక్ ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు పట్టించుకోకపోగా నౌహీరా షేక్ మీదనే తిరిగి కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై నౌహీరా షేక్ తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. సమాచారంతో ఫిలింనగర్ పోలీసులు బండ్ల గణేష్ పై ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch