Saturday, May 30, 2026
Home » మా ఇల్లు బఫర్ జోన్ లో లేదు … హైడ్రా కమిషనర్ రంగనాథ్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

మా ఇల్లు బఫర్ జోన్ లో లేదు … హైడ్రా కమిషనర్ రంగనాథ్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
మా ఇల్లు బఫర్ జోన్ లో లేదు ... హైడ్రా కమిషనర్ రంగనాథ్ - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లోని మధురా నగర్ లో తాము నివాసముంటున్న ఇల్లు బఫర్ జోన్ పరిధిలో లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉన్నారు. నాలుగు దశాబ్ధాల (1980)క్రితం తమ తండ్రి ఏపీవీ సబ్బయ్య ప్రస్తుతం తాముంటున్న ఇంటిని నిర్మించారని ఆయన అన్నారు. కృష్ణకాంత్ పార్కు దిగువన ఉన్న వేలాది ఇళ్ల తర్వాత తమ ఇల్లు ఉందని ఆయన చెప్పారు. తన తండ్రి నిర్మించి ఈ ఇల్లు బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని సోషల్ మీడియాతో పాటు కొన్ని దినపత్రికలలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఒకప్పటి పెద్ద చెరువునే రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందని అన్నారు. ఇంకా చెరువు కట్టకు దిగువన10 మీటర్లు దాటితే.. కింద వున్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల ప్రకారం బఫర్ జోన్ పరిధిలోకి రావన్నారు. చెరువు కట్టకు దాదాపు కిలో మీటర్ల దూరంలో తాము నివాసం ఉంటున్న యిల్లు ఉన్నాయి. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాన్ని తాను ఖండిస్తున్నానని రంగనాథ్ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch