Wednesday, February 18, 2026
Home » మరణానంతరం వైద్య విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలిచిన వియ్యపురాళ్లు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

మరణానంతరం వైద్య విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలిచిన వియ్యపురాళ్లు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
మరణానంతరం వైద్య విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలిచిన వియ్యపురాళ్లు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్రణ హైదరాబాద్: తాము బతికి ఉన్న కాలంలో కలిసిమెలిసి ఉంటూ మరణాంతరం వెయ్యపురాళ్లు ఒకే ఇంట సుమారు 25 ఏళ్ల పాటు జీవనం సాగించి మరణానంతరం వైద్య విజ్ఞానం తమ భౌతిక కాయాలను విద్యార్థుల పరిశోధన కోసం వీలునామా రాయడం ఒక గొప్ప విషయమని రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ వాణి అన్నారు.

ఖాజా గూడలో నివాసం ఉంటున్న ఈడుపుగంటి వెంకటరత్నమ్మ (92) వెంకనేని హైమావతి (78) ఇద్దరు వెయ్యపురాళ్లు వీరు 25 ఏళ్ల పాటు ఒకే ఇంట్లో కలిసి జీవించారు. అనంతరం వెంకటరత్నమ్మ 5న మరణించారు. ఆమె జీవించి ఉండగానే తన మరణాంతరం తన పార్టీవదేహాన్ని వైద్య విద్యార్థులకు అనాటమీ కోసం ఉస్మానియా మెడికల్ కళాశాలకు అప్పగించాలని వీలునామా రాశారు. ఆమె రాసిన ప్రకారం వెంకట రత్నమ్మ పార్థివదేహాన్ని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు అప్పగించారు. అనంతరం ఆమెను ఆదర్శంగా తీసుకొని హైమావతి తన మరణాంతరం వైద్య కళాశాలకు తన పార్థివదేహాన్ని అప్పగించాలని వీలునామా రాశారు. వెంకటరత్నం మరణించిన ఐదు రోజుల తర్వాత హైమావతి మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె పార్దివదేహాన్ని ఆసుపత్రికి నిలిపారు.

వెంకటరత్నమ్మ హైమావతి సంస్మరణ సభను వారి కుటుంబ సభ్యులు ఆదివారం నిర్వహించారు. ఈ ప్రముఖ డాక్టర్ వాణి ముఖ్య అతిథిగా హాజరైన వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. వియ్యపురాళ్ళు ఇద్దరు 25 ఏళ్ల పాటు ఒకే ఇంటిలో కలిసి జీవించి ఉండటం అభినందనీయం అన్నారు. అదేవిధంగా మరణానంతరం ఇద్దరు తమ పార్టీవదేహాలను వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలని నిర్ణయం తీసుకొని ఆదర్శవంతంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ వైజయంతి రావు, ఉస్మానియా డెంటల్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ జై కుమార్ ,ఆధ్యాత్మిక వక్త బ్రహ్మశ్రీ దయానంద స్వామీజీ, పిరమిడ్ మెడిటేషన్ సొసైటీ ప్రమోటర్ సురేష్ బాబు, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, రమాదేవి తో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రతాప్ బంధుమిత్రులు పాల్గొని వారికి నివాళులర్పించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch