Tuesday, February 24, 2026
Home » విజయ్ సేతుపతి విడుదల 2 పాట విడుదల – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Newswatch

విజయ్ సేతుపతి విడుదల 2 పాట విడుదల – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Newswatch

by News Watch
0 comment
విజయ్ సేతుపతి విడుదల 2 పాట విడుదల - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


విజయ్ సేతుపతి పెర్ఫార్మన్స్ హైలెట్ గా రూపొందించిన చిత్రం విడుదల2.ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. కాగా ఈ తొలి పాట ,”పావురమా పావురమా” అనే పాటను నిన్న విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ “మాంత్రికుడు ఇళయరాజా స్వరపరిచిన ,”విడుదల 2” తొలిపాటను నిన్న విడుదల చేయడం ఆనందంగా ఉంది. కాసర్ల శ్యామ్ కలం నుంచి విడుదలైన ఈ పాటను తెలుగు ప్రేక్షకులు ఇంత స్పీడుగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్ గా నిలిచింది. కనువిందు చేయబోతోంది.

అలాగే ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీన్, సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్‌తో కలిసి ఈ చిత్ర అత్యద్భుతంగా తెరకెక్కించారు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్ర హక్కులను మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతున్నాం. డిసెంబర్ 20 న ఇండియన్ సెల్యూలాయిడ్ పై ప్రేక్షకులంతా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్, రాజీవ్ మీనన్, ఇలవరసు , బాలాజీ శక్తివేల్ నటించిన ఈ చిత్రం: ఇళయరాజా, డి ఓ పి: వేల్ రాజ్, ఎడిటింగ్: ఆర్ : రామ్, పి ఆర్ ఓ: బి. వీరబాబు, దర్శకత్వం: వెట్రి మారన్, నిర్మాతలు: ఎల్ రెడ్ కుమార్

చింతపల్లి రామారావు (తెలుగు వెర్షన్)

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch