1,357 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం
వరంగల్ జిల్లా సంగెం, శాయంపేట మండలాల మధ్యలో ఉన్న చింతలపల్లివద్ద గత రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.ఈ మేరకు ఆ చుట్టుపక్కల శివారు భూముల్లో 2016లోనే విడతల వారీగా మొత్తంగా 1,357 ఎకరాలు సేకరించారు. దీంతో దాదాపు 863 మంది భూములను కోల్పోగా.. భూ సేకరణసమయంలో పరిహారం విషయంలో అక్కడి రైతులు గొడవ చేశారు. అప్పటి మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఎకరానికి రూ.10 లక్షల చొప్పున మాత్రమే పరిహారం చెల్లించి, రైతులు సాగు చేసుకుంటున్న భూములను మెగా టెక్స్ టైల్ పార్కు సేకరించారు. కాగా సాగు చేసుకుంటున్న భూములతోపాటు ఉపాధి కోల్పోయిన అప్పటి ప్రభుత్వానికి భూములు రైతులకు ఇంటికో ఉద్యోగంతో పాటు టెయ్ టైల్ పార్కేరియాలోనే ఒక్కో ఎకరానికి 100 గజాల చొప్పున స్థలం ఇస్తామని చెప్పింది.