16
రాష్ట్రానికి పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్‌గా లోకేశ్ ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారు. అమెరికా పర్యటనకు ముందు ముంబైలో రిలయన్స్ సంస్థతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఆయన కృషితో రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిద్ధమైంది. గుజరాత్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీలో మాత్రమే ఇంత పెద్దఎత్తున పెట్టుబడులకు సిద్ధమైంది. ఏపీలో 500 అధునాతన బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోంది.