2
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శబాష్‌గూడెంలో 8వ తరగతి విద్యార్థి మనోజ్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. చేర్యాలలో వికాస్ హై స్కూల్‌లో మనోజ్ 8వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షలో మనోజ్ కాపీ కొట్టడంతో ప్రిన్సిపాల్ హెచ్చరించారు. అయితే ఈ విషయం తెలిసిన మనోజ్ తండ్రి తోటి విద్యార్థుల ముందే చేయి చేసుకున్నాడు. దీంతో అవమానం భరించలేక చెట్టుకు ఉరి వేసుకొని మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.