6
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిపై దాడుల నియంత్రణకు స్టేట్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, వయలెన్స్ ప్రివెన్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని డెసిషన్ తీసుకున్నది. దీనికి సంబంధించి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశాలతో కమిటీల ఏర్పాటుకు హెల్త్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ హెల్త్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో జిల్లా, ఏరియా ఆస్పత్రులు, డైరెక్టర్ ఆఫ్మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ హాస్పిటల్స్.. ఇలా అన్నింటిలోనూ ఈ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇవి హాస్పిటల్స్ భద్రత పెంపుతో పాటు స్టాఫ్ సేఫ్టీలో క్రీయాశీలక పాత్ర పోషించనున్నాయి.